దుర్గి: సెప్టెంబర్ 05
రాజధాని వాయిస్ :
మండల పరిధిలోని పోలేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు దాతలు బూసాని నాగరాజు, దీనం వెంకటరెడ్డి, బిట్టు అనంత రామయ్య ఉదారంగా ముందుకు వచ్చి ఈ క్రీడా దుస్తులను విరాళంగా సమకూర్చారు.
ఈ సందర్భంగా దాతలు స్వయంగా విద్యార్థులకు క్రీడా దుస్తులను అందజేసి వారిని ప్రోత్సహించారు. పాఠశాల విద్యార్థుల ప్రగతికి తమ వంతు సహాయసహకారాలు అందించిన దాతలకు పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు ఆర్. బాబూలాళ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ యం సి) సభ్యులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!