డి.జె.లకు పర్మీషన్ లేదు,
రాజుపాలెం ఎస్ ఐ. మణి కృష్ణ
రాజుపాలెం మండల ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఐ. మణి కృష్ణ.
రాజుపాలెం.సెప్టెంబరు 14, రాజధానికి వాయిస్:
ప్రస్తుతం వినాయక చవితి ఉత్సవాల, నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతలు, ప్రజల ప్రశాంతత రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో డీజేలకు ఎటువంటి అనుమతి ఇవ్వబడలేదు. కాబట్టి నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ డీజే సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదని స్పష్టం చేశారు.అనుమతులు లేకుండా డీజే నిర్వహించిన యెడల కేసు నమోదవుతుందని హెచ్చరించారు.రాజుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని సంబంధిత అధికారుల నుంచి ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా డీజే సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి అధిక శబ్దంతో నిర్వహించిన యడల ఎటువంటి సిఫారసులను పరిగణలోకి తీసుకోకుండా కేసు నమోదు చేస్తామన్నారు. అనుమతులు లేకుండా డీజేలు ఏర్పాటు చేయడం, అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్స్ వినియోగించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం లేదా పోలీసుల ఆదేశాలను ఉల్లంఘించడం జరిగితే సంబంధిత నిర్వాహకులు, డీజే యజమానులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
వినాయక నిమజ్జన కార్యక్రమాలనుశాంతియుతంగా, సురక్షితంగా మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Be the first to share your thoughts on this story!