నరసరావుపేటలో ప్రజా సంఘాల నిరసన
నరసరావుపేట.
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న హమారా ప్రసాద్‌పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మాలమహానాడు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ళ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షుడు న్యాయవాది డాక్టర్ గోదా జాన్ పాల్ ఆధ్వర్యంలో, నరసరావుపేట నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ వుస్తేల జయరావు అధ్యక్షతన స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి, ప్రతీకాత్మకంగా దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ గోదా జాన్ పాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ పుస్తకం విడుదల చేసేందుకు ప్రయత్నించడం తీవ్ర అభ్యంతరకరమని, ఇది కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. సామాజిక సామరస్యానికి భంగం కలిగించేలా ప్రసంగాలు చేస్తున్న హమారా ప్రసాద్‌పై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని, ఇలాంటి చర్యలను అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యవాదులు, అణగారిన వర్గాల తరఫున నిరసనలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భరోసా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దారా అభినయ దర్శన్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కోటా సుబ్బు మాదిగ, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు బాదుగున్నల శీను, బీఎస్పీ నాయకుడు బుదాల బాబురావు, సీనియర్ దళిత నాయకుడు వంజా జాన్ ముత్తయ్య, జనజాగృతి మహిళా మండలి ప్రతినిధి విడతల రమాదేవి, ఎమ్మార్పీఎస్-ఎస్ నాయకుడు చితిరాల మీరయ్య, ఎంఐఎం ప్రతినిధులు షేక్ మౌలాలి, షేక్ మస్తాన్ వలీ, జై భీమ్ సంక్షేమ సంఘం నేత జూలూరి రమేష్, పీడీఎం నాయకులు నల్లపాటి రామారావు, వై. వెంకటేశ్వరరావు, ఏపీ గిరిజన సంఘం నేత కోటా నాయక్, అమరావతి రజక ఐక్యవేదిక ప్రతినిధి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!