Tuesday, 20 October 2026
Header1
BREAKING

గురజాడ ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం

- మహాకవి, సంఘ సంస్కర్తకు హోంమంత్రి అనిత ఘన నివాళులు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 21 Sep 2026, 05:01 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 110 views

అమరావతి.

సెప్టెంబర్ 21
రాజధాని వాయిస్ :

మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఘన నివాళులర్పించారు. గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. “దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అంటూ తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించిన మహాకవి గురజాడ అప్పారావు అని కొనియాడారు. తెలుగు సాహిత్యానికి కొత్త అర్థాన్ని చూపించడమే కాకుండా, సామాన్య ప్రజలకు సైతం సులభంగా అర్థమయ్యేలా ఎన్నో గొప్ప రచనలు చేశారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరంలో గురజాడ అప్పారావు జన్మించడం తనకు, నియోజకవర్గ ప్రజలకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అనిత అన్నారు. మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సాహితీ, సామాజిక, సాంస్కృతిక రంగాలకు గురజాడ అప్పారావు చేసిన సేవలు మరువలేనివని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఆయన రచనలు ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ఉన్నాయని అన్నారు. మహిళా సాధికారత, సామాజిక బాధ్యత, సమానత్వం వంటి అంశాలపై గురజాడ ఎన్నో రచనలు చేసి సమాజానికి మార్గదర్శకంగా నిలిచారని తెలిపారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X