తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు నినాదమైన ప్రజల వద్దకే పాలన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తుందని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు.
సోమవారం స్థానిక వివిఎన్ గార్డెన్ నందు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుపరిపాలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని తెలిపారు. నిత్యం ప్రజా సమస్యలపై అధికారులతో కూటమి పార్టీల నాయకులతో ప్రజా గ్రీవెన్స్ నిర్వహించి, తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని వివరించారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా గడిచిన రెండేళ్ల పాలనలో వేల కోట్లతో జల్ జీవన్ మిషన్, అమృత్ స్కీం, వరికపూడిశెల ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కయని ఆయన వెల్లడించారు.
మండాది, పట్లవీడు గ్రామాల మధ్య 500 ఎకరాల్లో టెక్సటైల్ పార్క్, 800 ఎకరాల్లో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపనలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి కృష్ణప్రియ,డిఆర్ఓ అద్దెయ్య, ఆర్డీవో మురళీకృష్ణ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి గబ్రూ నాయక్, జిల్లాస్థాయి అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాచర్ల సెప్టెంబర్ 21 రాజధాని వాయిస్ :తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు నినాదమైన ప్రజల వద్దకే పాలన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తుందని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి...
మాచర్ల సెప్టెంబర్ 21 రాజధాని వాయిస్ :
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు నినాదమైన ప్రజల వద్దకే పాలన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తుందని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు.
సోమవారం స్థానిక వివిఎన్ గార్డెన్ నందు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సుపరిపాలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని తెలిపారు. నిత్యం ప్రజా సమస్యలపై అధికారులతో కూటమి పార్టీల నాయకులతో ప్రజా గ్రీవెన్స్ నిర్వహించి, తక్షణమే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని వివరించారు. నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా గడిచిన రెండేళ్ల పాలనలో వేల కోట్లతో జల్ జీవన్ మిషన్, అమృత్ స్కీం, వరికపూడిశెల ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కయని ఆయన వెల్లడించారు.
మండాది, పట్లవీడు గ్రామాల మధ్య 500 ఎకరాల్లో టెక్సటైల్ పార్క్, 800 ఎకరాల్లో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి త్వరలో శంకుస్థాపనలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫారెస్ట్ అధికారి కృష్ణప్రియ,డిఆర్ఓ అద్దెయ్య, ఆర్డీవో మురళీకృష్ణ, నియోజకవర్గ ప్రత్యేక అధికారి గబ్రూ నాయక్, జిల్లాస్థాయి అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!