Tuesday, 20 October 2026
Header1
BREAKING

పేద, గ్రామీణ విద్యార్థులకు ఉచిత నీట్, జేఈఈ శిక్షణ అభినందనీయం<div><br><div> ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు</div></div>

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 05 Sep 2026, 12:31 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 28 views

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. సెప్టెంబర్  05

పేద, మధ్యతరగతి, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యల వల్ల ఖరీదైన ప్రవేశ పరీక్షల శిక్షణ తీసుకోలేకపోతున్నారని, అలాంటి వారికి ఉచితంగా నాణ్యమైన తర్ఫీదు అందించడం ఎంతో ప్రశంసనీయమని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలోని 23వ వార్డు భిషప్ అజరియా బాలికల పాఠశాలలో కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ, గ్రామీణ పాఠశాలల విద్యార్థుల కోసం నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించే "విద్యా విజయం" కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన బొండా ఉమా మాట్లాడుతూ, విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులతో సమానంగా ప్రభుత్వ, గ్రామీణ ప్రాంతాల పిల్లలు కూడా జాతీయ స్థాయి పరీక్షల్లో పోటీపడేలా నాణ్యమైన విద్యను, సరైన మార్గదర్శకత్వాన్ని అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ విజయరాజ్. జి తెలిపారు. ఎనిమిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు, ముఖ్యంగా బాలికలకు విద్యా సాధికారత చేకూర్చేందుకు దీనిని నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ ఉచిత శిక్షణను విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 23వ వార్డు పూర్వ ప్రజాప్రతినిధి నెల్లిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X