Tuesday, 20 October 2026
Header1
BREAKING

నరసరావుపేట వరవకట్టలో పోలీసుల విస్తృత కార్డన్ &amp; సెర్చ్..<div><br></div><div> శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు</div>

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 05 Sep 2026, 01:24 PM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 6 views

నరసరావుపేట. సెప్టెంబర్ 05

శాంతిభద్రతల పరిరక్షణ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, నేర నియంత్రణే లక్ష్యంగా పల్నాడు జిల్లా పోలీసులు శనివారం ఉదయం నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వరవకట్ట ప్రాంతంలో మెరుపు తనిఖీలు చేపట్టారు. పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ  రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాల మేరకు, నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు పర్యవేక్షణలో ఉదయం 6 గంటల నుంచే భారీ బందోబస్తు నడుమ ఈ ‘కార్డన్ & సెర్చ్’ ఆపరేషన్ సాగింది. సంఘ వ్యతిరేక శక్తుల ఆటకట్టించి, సాధారణ ప్రజలకు 'మేమున్నాం' అనే భరోసా కల్పించేందుకే ముమ్మరంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో భాగంగా పోలీసు అధికారులను, సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా విభజించి వరవకట్ట పరిసర ప్రాంతాలు, ఇళ్లలో విస్తృతంగా జల్లెడ పట్టారు. ముఖ్యంగా రౌడీషీటర్లు, పాత కేసుల్లోని నిందితులు, అనుమానిత వ్యక్తుల ఇళ్లలో అణువణువూ సోదాలు నిర్వహించి వారి కదలికలపై నిఘా ఉంచారు. రికార్డులు, సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సోదాల అనంతరం అధికారులు స్థానికంగా ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి వరవకట్ట వాసులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ముఖ్యంగా యువతను పెడదారిన పట్టిస్తున్న గంజాయి, మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానికంగా ఎవరైనా అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. పాత కేసుల్లోని నిందితులను పిలిపించి మాట్లాడిన అధికారులు, నేర ప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో మెలగాలని గట్టిగా హెచ్చరించారు. వార్డులో అకారణంగా ఘర్షణలకు దిగినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావచ్చని భరోసా ఇచ్చారు.
ఈ కార్డన్ & సెర్చ్ కార్యక్రమంలో డీఎస్పీ ఎం. హనుమంతరావుతో పాటు నరసరావుపేట వన్ టౌన్ సీఐ ఫిరోజ్, టూ టౌన్ సీఐ ప్రభాకర్, రూరల్ సీఐ సుబ్బారావు, చిలకలూరిపేట టౌన్ సీఐ రమేష్, వినుకొండ రూరల్ సీఐ బ్రహ్మయ్య, సబ్-డివిజన్ ఎస్సైలు మరియు భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X