చిలకలూరిపేట: సెప్టెంబర్ 03
చిలకలూరిపేట మున్సిపాలిటీ మాజీ కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు షేక్ భక్షు మేస్త్రి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని నేరుగా ఆయన నివాసానికి చేరుకుని పరామర్శించారు.
భక్షు మేస్త్రిని ఆప్యాయంగా పలకరించిన ఆమె, ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్స వివరాలను, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎల్లవేళలా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే భక్షు మేస్త్రి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని భరోసా కల్పించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని నూరిపోస్తూ, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆయన వేగంగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో మునుపటిలా చురుగ్గా పాల్గొనాలని మాజీ మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Be the first to share your thoughts on this story!