Tuesday, 20 October 2026
Header1
BREAKING

విశాఖ ఉక్కు నిర్వాసితుల ధర్నాకు బీసీవై పార్టీ సంపూర్ణ మద్దతు...

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 10 Sep 2026, 04:17 PM
🔄 నవీకరణ: 12 Oct 2026, 05:13 AM
👁️ 112 views
విశాఖపట్నం.

 విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం ఆధ్వర్యంలో బీసీ గేట్ వద్ద గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ధర్నాకు బీసీవై పార్టీ పూర్తి సంఘీభావం తెలిపింది. పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు పార్టీ ప్రతినిధి బృందం నేడు ధర్నా శిబిరాన్ని సందర్శించి నిర్వాసితులకు తమ మద్దతు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నమ్మి అప్పలరాజు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు అల్లు రమణారావు, రాష్ట్ర మహిళా కో-కన్వీనర్ అనుపమ యాదవ్, విశాఖ జిల్లా నాయకులు అంజూరు దీపక్, కేత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిర్వాసితుల న్యాయమైన హక్కులు, డిమాండ్ల సాధన కోసం బీసీవై పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో ఐక్య సంఘం చేపట్టే అన్ని పోరాట కార్యక్రమాలలో ప్రత్యక్షంగా భాగస్వామ్యమై తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X