వినాయక సమితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్నారులకు మరియు వృద్ధులకు ప్రత్యేకమైన అన్నదానం చేస్తున్న స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి.
వినాయక సమితి పర్వదినాన్ని పురస్కరించుకొని హేశ్రిత కార్తీ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు ప్రభాకర్ రెడ్డి, కమల సుజ మరియు గుంట లక్ష్మారెడ్డి మరియు వారి ధర్మపత్ని స్వప్న మరియు కుమార్తె రోహితారెడ్డిలు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వామి వివేకానంద సేవాశ్రమంలోని చిన్నారులకు మరియు మాచర్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, చర్చిలు, మసీదు దగ్గర మరియు ఫ్లాట్ ఫార్మ్స్ మీద మీద ఉన్నటువంటి వృద్ధులకు, అనాధలకు ప్రత్యేకమైన అన్నదానం చేసినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు.
అనాధలు, వృద్ధులు, వికలాంగులు, అందులు, యాచకులు వారే ప్రత్యక్ష దైవాలని ముందుగా వారిని సేవించాలన్న స్వామి వివేకానంద స్ఫూర్తితో నిత్య అన్నదాన కార్యక్రమం చేయడమే కాకుండా పండుగ దినాలలో ప్రత్యేకమైన అన్నదానం చేస్తున్నట్లు గోవింద రెడ్డి తెలిపారు. మాచర్ల పట్టణంలో గత 15 సంవత్సరములుగా నిత్యము మూడు పూటలా స్వయంగా వారి వద్దకే వెళ్లి అన్నదానం చేస్తున్న మెట్టు గోవింద రెడ్డిని ఈ సందర్భంగా దాతలు అభినందిస్తున్నారు. ఆ వినాయకుని ఆశీస్సులు ఎల్లవేళలా ఆ స్వామి వివేకానంద సేవాశ్రమమునకు ఉండాలని ప్రార్థిస్తున్నట్లు దాతలు తెలియజేశారు.
Be the first to share your thoughts on this story!