*పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం పబ్లిక్ రిలేషన్ కమిటీ వైస్ చైర్మన్‌గా గొడవర్తి కృష్ణమూర్తి*
బెల్లంకొండ:రాజధాని వాయిస్:
పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త గొడవర్తి కృష్ణమూర్తికి ఆర్యవైశ్య సంఘంలో కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం పబ్లిక్ రిలేషన్ కమిటీ వైస్ చైర్మన్‌గా నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు చందోలు వెంకట సూర్యప్రకాష్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా గొడవర్తి కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ... తనపై నమ్మకంతో పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘంలో ఇంతటి కీలక బాధ్యతలను అప్పగించిన జిల్లా అధ్యక్షుడు చందోలు వెంకట సూర్యప్రకాష్ రావుకు మరియు సంఘ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అప్పగించిన బాధ్యతలను త్రికరణ శుద్ధిగా, క్రమశిక్షణతో నిర్వర్తిస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆర్యవైశ్య సమాజ సేవకు, సంఘ బలోపేతానికి తన వంతు శాయశక్తులా కృషి చేస్తానని మీడియా ముఖంగా వెల్లడించారు. కృష్ణమూర్తి నియామకం పట్ల పాపాయపాలెం గ్రామస్థులు, మండల ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Be the first to share your thoughts on this story!