పిడుగురాళ్ళ.సెప్టెంబర్ 2,రాజధాని వాయిస్:
ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ అసోసియేషన్ సభ్యులు పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమావేశాన్ని గురజాల నియోజకవర్గం సెక్రటరీ వివేకానంద స్కూల్ డైరెక్టర్ ఆత్మకూరు రామకృష్ణ మాస్టర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఖాసిం, విశ్రాంత మండల విద్యాశాఖ అధికారి నాగుల మీరా హాజరైనారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా అపుస్మ జిల్లా అధ్యక్షుడు పి.జే.ఎన్ ధన్ విద్యారంగంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించి తదనంతరం మండల విద్యాశాఖ అధికారికి అపస్వా సభ్యులందరూ ఘనంగా సన్మానించడం జరిగింది. తదనంతరం మండల విద్యాశాఖ అధికారి కోరిక మేరకు ఆఫీస్ ఫర్నిచర్ ను అపుస్మ సభ్యులందరూ కలసి అందజేయడం జరిగింది. ఈసందర్భంగా దన్ మాట్లాడుతూ అపుస్మ రాష్ట్ర అధ్యక్షుడు తులసి విష్ణు ప్రసాద్ , సెక్రెటరీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా ముందుకు యూనియన్ ను తీసుకువెళ్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Be the first to share your thoughts on this story!