రేపల్లె: పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్థానిక నాయకులు స్పష్టం చేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 69 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.72,89,587 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. రాష్ట్రంలో నిరుపేదలు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రధాన సంకల్పమని, ఆయన ఆదేశాల మేరకు అత్యవసర శస్త్రచికిత్సల కోసం ముందస్తు హామీ పత్రాలతో పాటు బాధిత కుటుంబాలకు సకాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంజూరు చేస్తూ ప్రభుత్వం కష్టకాలంలో కొండంత అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక స్తోమత లేక ఎవరూ వైద్యానికి దూరం కాకూడదన్న లక్ష్యంతో ప్రజల సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tuesday, 20 October 2026
rajadhanivoice.in
పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం భరోసా
- రేపల్లెలో రూ.72.89 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
📰
Official Article Source Link
https://rajadhanivoice.in/post/alliance-government-to-ensure-health-of-the-poor
Be the first to share your thoughts on this story!