Tuesday, 20 October 2026
Header1
BREAKING

పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా అదిరాల నాగమణి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 04 Sep 2026, 07:14 PM
🔄 నవీకరణ: 02 Oct 2026, 02:11 PM
👁️ 31 views
 మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లిని కలిసి సత్కారం

మాచర్ల. సెప్టెంబర్ 04

పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నూతన కార్యవర్గంలో అదిరాల నాగమణికి సముచిత స్థానం దక్కింది. జిల్లా మహిళా విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఆమె నూతనంగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీలో తనకు బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, పార్టీ బలోపేతానికి, మహిళలను మరింత చైతన్యవంతం చేయడానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, జిల్లా అధ్యక్షులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, పార్టీ ఆదేశాల మేరకు చిత్తశుద్ధితో పనిచేస్తానని నాగమణి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X