మాచర్ల.
మాచర్ల పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో కారంపూడి మండలం నరమాలపాడు గ్రామానికి చెందిన 15 టీడీపీ కుటుంబాలు గురువారం వైఎస్సార్సీపీలో చేరాయి. పార్టీ విధానాలకు ఆకర్షితులై చేరిన ప్రతి ఒక్కరికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని, అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!