Tuesday, 20 October 2026
Header1
BREAKING

108 అంబులెన్స్‌లోనే కవలలకు జన్మనిచ్చిన బాలింత:

సిబ్బంది సమయస్ఫూర్తికి ప్రశంసలు

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ: 16 Sep 2026, 09:07 AM
🔄 నవీకరణ: 23 Sep 2026, 03:17 PM
👁️ 138 views

మాచర్ల: సెప్టెంబర్ 15 రాజధాని వాయిస్ :

పురిటి నొప్పులతో అల్లాడుతున్న ఓ నిండు గర్భిణికి 108 సిబ్బంది మార్గమధ్యంలోనే సురక్షితంగా కాన్పు చేసి, తల్లితో పాటు కవల శిశువులను కాపాడి తమ మానవత్వాన్ని, సమయస్ఫూర్తిని చాటుకున్నారు. పల్నాడు జిల్లా ఎర్రబాలెం గ్రామానికి చెందిన ఎం. అనురాధ (19) అనే గర్భిణికి మొదటి కాన్పు సమయంలో తీవ్రమైన నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు వెల్దుర్తి 108 అంబులెన్స్ ద్వారా మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి, కడుపులో కవలలు ఉన్నందున పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు.దీంతో జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు, ఓఈ మారుతి సూచనలతో మాచర్ల 108 ఈఎంటీ హుస్సేనమ్మ, పైలెట్ అర్జున్ కుమార్ బాధితురాలిని నరసరావుపేటకు తరలిస్తుండగా, పాల్వాయి గేటు సమీపంలో ఆమెకు నొప్పులు తీవ్రమయ్యాయి. వెంటనే అంబులెన్స్‌ను పక్కకు నిలిపి, 108 ఈఆర్‌సీపీ డాక్టర్ సుప్రియ ఫోన్ ద్వారా అందించిన సలహాలతో ఈఎంటీ హుస్సేనమ్మ చాకచక్యంగా ప్రసవం చేయడంతో రాత్రి సుమారు 8:55 గంటలకు మొదటి మగ శిశువు జన్మించాడు. అనంతరం ప్రయాణం కొనసాగిస్తుండగా గురజాల సమీపంలో మళ్లీ నొప్పులు ఎక్కువ కావడంతో వాహనాన్ని నిలిపి రెండో కాన్పు కూడా విజయవంతంగా పూర్తి చేశారు.ఈ కాన్పులోనూ మరో మగ బిడ్డ జన్మించడంతో తల్లి, ఇద్దరు శిశువులకు తక్షణమే ఆక్సిజన్, ఫ్లూయిడ్స్ అందించి ప్రథమ చికిత్స చేస్తూ నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి సురక్షితంగా చేర్చారు. ఆపత్కాలంలో ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందిని కుటుంబ సభ్యులు, అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X