*సత్తెనపల్లి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా మామిడి దివ్యవాణి*
సత్తెనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన మారెళ్ల రామాంజనేయులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. వైస్ చైర్‌పర్సన్ ఎంపికపై ఇంతకాలం నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 36వ వార్డు జనసేన కౌన్సిలర్ మామిడి దివ్యవాణిని వైస్ చైర్‌పర్సన్‌గా పార్టీ అధిష్టానం ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. అధిష్టానం నుంచి అధికారిక తీర్మానం అందకపోవడంతో నేడు ఆమె ప్రమాణ స్వీకారం చేయలేదు. తాజా నిర్ణయంతో వైస్ చైర్‌పర్సన్ ఎంపికపై స్పష్టత వచ్చింది.
Be the first to share your thoughts on this story!