మాచర్ల: నవంబర్ 22 రాజధాని వాయిస్ :
మాచర్ల మున్సిపాలిటిని సర్వాంగ సుందరంగా తీర్చాలనిశాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్ యెనుముల సుష్మా కేశవరెడ్డి పదవీ బాధ్యత ప్రమాణస్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
ముందుగా స్థానిక రింగ్ రోడ్డు నుంచి భారీ ర్యాలీ, గజమాలతో ఎమ్మెల్యే జూలకంటిని ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం మెయిన్ రోడ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అనంతరం వేద పండితుల వేదమంత్రోచ్ఛారణల నడుమ స్వాగతం పలికారు. అనంతరం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, ఆర్డీవో మురళికృష్ణ, మున్సిపల్ కమిషనర్ వేణుబాబు సమక్షంలో ఎమ్మెల్యే కౌన్సిల్ సభ్యులతో ప్రయాణం చేయించారు. ఆ తరువాత, వారిని ఘనంగా సన్మానించి, అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ రెండునరేళ్ళ పాలనలో దాదాపు రూ.220 కోట్ల నిధులను మున్సిపాలిటికి కేటాయించి,రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వంటి మౌలిక వసతులను అభివృద్ధిపరిచిందని వివరించారు. అమృత్ స్కీం ద్వారా త్వరలో ప్రతి ఇంటికి శుద్దమైన తాగునీటిని అందిస్తామన్నారు. మున్సిపల్ శాఖ, హ్యామ్ మోడ్ విధానంలో ప్రభుత్వం అందించిన ప్రత్యేక నిధులు ద్వారా ఇప్పటికే దాదాపు పట్టణ సివారు కాలనీలో మౌలిక వసతులను ఆధునీకరించామన్నారు. ఇప్పటికే పట్ణణం బైపాస్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పనులు పూర్తికాగానే పట్టణ సుందరీకరణపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా, సేవలు త్వరతిగతిని పూర్తి చేసి, పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!