*బీహార్ ను తలపించేలా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమన్వయకర్త డాక్టర్ గజ్జల*
సత్తెనపల్లి పట్టణం నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన సమన్వయకర్త
*డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి*
రాజధానివాయిస్:సత్తెనపల్లి.
ఎలక్షన్ల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నామినేషన్స్ ప్రక్రియ మొదలవగానే నకరికల్లు, ముప్పాళ్ళ లో నామినేషన్లు చించి వేశారు రాజుపాలెంలో అయితే నామినేషన్లు వేయనీయకుండా టిడిపి గుండాలు రోడ్లపై కలలతో రాళ్లతో నామినేషన్ కేంద్రానికి పోనివ్వని పరిస్థితి నేను ఎస్పీ గారికి, డీఎస్పీ గారికి, సిఐ గారికి, ఫోన్ చేసి మాట్లాడితే వెహికల్ అరెంజ్ చేస్తామని అన్నారు. టైం గడుస్తున్న వెహికల్ అరెంజ్ చేయని పరిస్థితి అడిగితే మీరు రాండి మేము తీసుకెళ్లి వేయిస్తాం అంటారు పరిస్థితి చూస్తే రోడ్లపై కర్రలతో దాడి చేస్తున్న టిడిపి గుండాలు
నకరికల్లులో అయితే సీసీ కెమెరాలు ఆపి వేసిన నామినేషన్లను అధికారుల వద్దకు వెళ్లి చించివేసిన టిడిపి నాయకులపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. జడ్పిటిసిగా నామినేషన్ వేసిన అభ్యర్థి భర్తను అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎస్ఐ గారు మఫ్టీ స్టేషన్ తీసుకువెళ్లి బెదిరించి విత్ డ్రా చేయించారు. సాక్షాదారాలతో వీడియోలు డిఎస్పి గారికి పంపి మాట్లాడితే నేను యాక్షన్ తీసుకుంటా అన్నారు ఇంతవరకు స్పందించలేదు.
ముప్పాళ్ళ లో పోలీసుల ముందే నామినేషన్ పత్రాలను మహిళల నుంచి లాక్కొని చించుతుంటే స్పందించలేదు. వారిపై ఇంతవరకు కేసు పెట్టలేదు.
సత్తెనపల్లి 12వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి పెద్దింటి గోవిందమ్మ గారి భర్తను ఎలక్షన్ ముందు రోజు 10 గంటలకు పోలీసులు వచ్చి తీసుకువెళ్లారు. మరుసటి రోజు 5 గంటలకు విడిచిపెట్టారు. ఎలక్షన్ రోజు వారి అబ్బాయిని నలుగురు వ్యక్తులు బైకుపై కిడ్నాప్ చేశారు అందులో డుమ్ము అలియాస్ తేజ అనే వ్యక్తి ఉన్నాడు. ఇంతవరకు దానిపై స్పందించలేదు.
రాజుపాలెంలో జడ్పిటిసి అభ్యర్థి నీ ఎన్నికల ముందు రోజు ఎస్ఐ గారు వెహికల్ లో మా ఎన్నికల బూత్ ఏజెంట్ల ఇళ్లకు తీసుకువెళ్లి బెదిరించి వారి బూత్ ఏజెంట్ ధ్రువీకరణ పత్రాన్ని చించివేసిన పరిస్థితులు
మాదల గ్రామంలో బూత్ ఏజెంట్ల నియమక ప్రక్రియ జరగకుండా అడ్డుకుంటుంటే నేను వెళ్లి మా బూత్ ఏజెంట్ల పత్రాలను అధికారులకు ఇచ్చి వారిని నియమించాము. పోలీసులు వచ్చి ప్రివెంటివ్ అరెస్ట్ అని నన్ను అక్కడనుండి నరసరావుపేటకు తీసుకువెళ్లి హౌస్ అరెస్టు చేశారు.
ప్రివెంటు అరెస్ట్ అంటే ముందుగా నోటీస్ ఇవ్వటం కానీ కారణాలు ఏమి ఉండవని సమాధానం చెప్తున్నారు.
పోలీసులు వర్సెస్ వైసిపి అన్నట్లే ఎన్నికలు జరిగాయి.
పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని వారిని పావులను చేసి ఆడిస్తున్న కూటమి ప్రభుత్వం.
ఎలాంటి గెలుపు ఒక గెలుపేనా ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఇలా చేసే కన్నా డీఎస్సీ తరహాలో ఒక జీవోను తీసుకువచ్చి వారికి సంబంధించిన వారికి పదవులు ఇవ్వచ్చు కదా రాజ్యాంగాన్ని అని వీర్యం చేసేదేందుకు ఇలాంటి సంప్రదాయం ఇంతకుముందు ఎన్నడూ లేదు రానున్న రోజుల్లో ఇదే తరహాలో జరిగితే పరిస్థితి ఏంటి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏ అధికారి అయితే అధికారాన్ని దుర్వినియోగం చేశారో వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని నేడు అడ్డదారిలో పదవులు చేపట్టిన వారు రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల గ్రామ వార్డు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!