Saturday, 21 November 2026
Header1
BREAKING

బాలల హక్కులు అనుభవిస్తూ ప్రాధమిక విధులు నిర్వహించాలి...... సిస్టర్ విద్యా

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 20 Nov 2026, 04:46 PM
🔄 నవీకరణ: 21 Nov 2026, 07:27 AM
👁️ 10 views

⭐ Key Highlights / ముఖ్యాంశాలు

.
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):
తాడేపల్లి నవంబర్ 21 రాజధాని వాయిస్ :
తాడేపల్లి మండలం చిర్రావురు గ్రామంలో శుక్రవారం 20-11-26న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కులు దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సిస్టర్ విద్యా మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు వయసున్న ప్రతి బాలబాలికకు గౌరవప్రదమైన జీవితాన్ని,
భద్రతను అందించడానికి కల్పించబడినవే ఈ ప్రాథమిక హక్కులు అని భారత రాజ్యాంగం మరియు అంతర్జాతీయ ఒప్పందాల, ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ఒడంబడిక ప్రకారం ప్రధానంగా 4 హక్కులు ఉన్నాయని,ఈ ఒడంబడిక ప్రకారం అత్యంత కీలకమైన అంశాలు పిల్లల రక్షణ, వికాసం కోసం హక్కులు ఉంటే,దేశం పట్ల ప్రతి పౌరుడికి ఉండాల్సిన బాధ్యతలను ప్రాథమిక విధులు తెలియజేస్తున్నాయని,హక్కులువిధులు అనేవి ఒక నాణేనికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివని పిల్లలు తమ హక్కులను అనుభవిస్తూనే, తోటివారి హక్కులకు భంగం కలగకుండా తమ విధులను నిర్వర్తించినప్పుడే ఉత్తమ సమాజం ఏర్పడుతుంది అన్నారు.తరువాత అత్తోట పోతురాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ ప్రకారం ప్రతి భారత పౌరుడికి 11ప్రాథమిక విధులు ఉన్నాయని ఒక విద్యార్థిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా పిల్లలు పాటించాల్సిన ముఖ్యమైన విధులు అయిన రాజ్యాంగం మరియు జాతీయ చిహ్నాలను గౌరవించడం,
భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం,జాతీయ జెండా మరియు జాతీయ గీతాన్ని గౌరవించడం వాటిపట్ల బాలలు బాధ్యతగా ఉండేవిధంగా ఇంట్లో,పాఠశాలలో ఉపాధ్యాయులు విధిగా బోధిస్తూ పిల్లలను ఉత్తమపౌరులుగా తీర్చి దిద్దాలని అన్నారు.తరువాత హైకోర్టు అడ్వకేట్ చీర్ల లాలాచంద్ మాట్లాడుతూ దేశ ఐక్యత మరియు సమగ్రతను కాపాడటం కోసం కుల,మత, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా పిల్లలందరికీ ఆర్టికల్ 21- ఎ ప్రకారం 6నుండి14 సంవత్సరాలలోపు పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కు ఆర్టికల్ 24 ప్రకారం బాల కార్మిక నిషేధం14 సంవత్సరాల లోపు పిల్లలను ఎలాంటి ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనులకు నియమించరాదని,కుల,మత,వర్ణ,భాషా,లింగభేదం లేకుండా పిల్లలందరికీ ఆర్టికల్ 14,15 ప్రకారం సమానత్వపు హక్కుఉందని పెద్దలు తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి పిల్లలను ప్రోత్సహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ సిబ్బంది పెద్దిపాగ అనిల్ కుమార్,,స్కూల్ టీచర్స్ సచివాలయం సిబ్బంది,ఆశా వర్కర్లు,అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1