Saturday, 21 November 2026
Header1
BREAKING

ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఓటరుకు డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 18 Nov 2026, 09:17 PM
🔄 నవీకరణ: 21 Nov 2026, 06:27 AM
👁️ 19 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):

గుంటూరు.

నవంబర్ 18
రాజధాని వాయిస్ :

ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఎన్నికలకు సంబంధించి ఓటరుగా నమోదు కావడానికి డిసెంబరు 23 నుండి జనవరి 12 వరకు మరో అవకాశం ఉంటుందని గుంటూరు - కృష్ణా ఉపాధ్యాయ ఎం.ఎల్.సి ఇ.ఆర్.ఓ మరియు జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎన్నికలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 2వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు. పూర్వ గుంటూరు, కృష్ణా జిల్లాలలో పనిచేస్తున్న ఉన్నత పాఠశాల మరియు ఆపై స్థాయిలో బోధనలో ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఓటరుగా నమోదు కావడానికి అర్హులన్నారు. భారత ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు స్థానిక నివాసం ఉన్నప్పుడు మాత్రమే ఓటరుగా అర్హులుగా పరిగణింపడం జరుగుతుందని స్పష్టం చేశారు. 2026 నవంబరు 1వ తేదీకి ముందు ఆరు సంవత్సరాల నుండి వృత్తిలో కొనసాగాలని అందులో కనీసం మూడు సంవత్సరాల పాటు ఉన్నత పాఠశాల, ఆపై స్థాయిలో బోధన అనుభవం ఉండాలని అన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు అర్హత కలిగి ఉంటారని, వారికి జిల్లా విద్యాశాఖ అధికారి, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్ఐఓ), కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ నిర్ధారణ చేయాలని వివరించారు. ఓటరుగా ఆన్లైన్ ద్వారా నమోదు కావచ్చని లేదా ఫారం 19 పూర్తి చేసి ఏ.ఈ.ఆర్.వోలు ఉన్న స్థానిక తాసిల్దార్, ఎంపీడీవో, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లకు సమర్పించవచ్చని చెప్పారు. ఇప్పటి వరకు 15 వేల దరఖాస్తులు అందాయని,  మొత్తం 19 వేల వరకు పనిచేస్తున్నట్లు అంచనా ఉందని చెప్పారు.
ఈ సమావేశంలో కాంగ్రెసు పార్టీ ప్రతినిధి కె.కె.గుప్తా, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కంచర్ల శివరామయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి డా.టి.సేవ కుమార్, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి చిరతన గండ్ల వాసు, సి.పి.ఐ (ఎం) ప్రతినిధి కృష్ణకాంత్, వైఎస్ఆర్సిపి ప్రతినిధి వై పిచ్చి రెడ్డి, జన సేన పార్టీ ప్రతినిధి త్రినాథ్, తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1