తమిళనాడు సిఎం విజయ్ ఏపి దసరా ఉత్సవ్ కు ఆహ్వానం
అక్టోబర్ 11 నుంచి 20 వరకు విజయవాడలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్–2026కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు, తమిళనాడు ముఖ్యమంత్రి టి.ఎస్. జోసెఫ్ విజయ్ ని చెన్నైలో కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు జి.ఎం.సి. హరీష్ బాలయోగి, విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ శ్రీ కె. మురళి కలిసి ముఖ్యమంత్రి విజయ్ కు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.విజయవాడ ఉత్సవ్–2026కు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు తమిళనాడు ముఖ్యమంత్రిని కోరినారు.
Be the first to share your thoughts on this story!