Tuesday, 24 November 2026
Header1
BREAKING

కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు – మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి..

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 24 Nov 2026, 01:12 PM
👁️ 1 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):

➖ కార్తీక మాసంలో శివనామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు.. భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

➖ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణం మరింత వెల్లివిరిసేలా చర్యలు

నెల్లూరు.
 నవంబర్ 24: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా శివభక్తులందరికీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

కార్తీక మాసం అత్యంత పవిత్రమైన మాసమని, ఈ మాసంలో పరమశివుని ఆరాధించడం, దీపారాధన, అభిషేకాలు, ఉపవాసాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి రోజున శివారాధన చేయడం, దీపాలు వెలిగించడం ద్వారా ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, సౌభాగ్యం, సంతోషం కలగాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలోని శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండతో పాటు అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలు, శివాలయాల్లో కార్తీక మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు, దర్శన సౌకర్యాలు, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు.

కార్తీక మాసం ప్రారంభం నుంచి రాష్ట్రంలోని శైవ క్షేత్రాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని, హర హర మహాదేవ, ఓం నమఃశివాయ అనే శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగుతున్నాయని మంత్రి ఆనం సంతోషం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలుగానే కాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకలుగా నిలిచేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఈ కార్తీక పౌర్ణమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆధ్యాత్మిక వెలుగులు నింపాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, ఆ పరమశివుని దివ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆకాంక్షించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1