క్రీడల్లో డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్ ప్రతిభ
నరసరావుపేట.అక్టోబర్ 6,రాజధాని వాయిస్:
వైద్య సేవల్లో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్న డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్, క్రీడారంగంలోనూ తమ సత్తాను చాటింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని డీవీఆర్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన నరసరావుపేట టౌన్ హాస్పిటల్స్ చాంపియన్స్ టోర్నమెంట్లో అంజిరెడ్డి హాస్పిటల్స్ క్రీడా బృందం ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ కనబరిచింది. టోర్నమెంట్లో సాధించిన చాంపియన్స్ ట్రోఫీని హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లోకిరెడ్డి శ్రీనివాస రెడ్డి క్రీడా సిబ్బంది సాదరంగా అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, వైద్యరంగంలో సేవాభావంతో ముందుకు సాగుతున్న తమ సంస్థ ఉద్యోగులు క్రీడారంగంలోనూ ప్రతిభ కనబరచడం అభినందనీయమని అన్నారు. క్రీడలు ఉద్యోగుల్లో ఆరోగ్యం, ఉత్సాహం, టీమ్ స్పిరిట్‌ను పెంపొందించడంతో పాటు పరస్పర సహకార భావనను బలోపేతం చేస్తాయన్నారు. టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచి సంస్థకు గుర్తింపు తీసుకువచ్చిన క్రీడా సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏఓ పి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!