ఆయుర్వేద హాస్పటల్ ఆద్వర్యంలో ధన్వంతరి జయంతి ప్రత్యేక పూజలు
పిడుగురాళ్ళ.నవంబర్ 06,రాజధాని వాయిస్:
ఆయుర్వేదిక్ పితామహులు ధన్వంతరి జయంతిని పిడుగురాళ్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎస్టీ కాలనీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యశాల నందు శుక్రవారం ధన్వంతరి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అల్పాహారం అందించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల వైద్యాధికారిణి డాక్టర్. కురసాల మేఘమాల,పిటిఎస్ దూదేకుల బాబు, యోగ నిర్వాహకురాలు కోటేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!