Saturday, 21 November 2026
Header1
BREAKING

చిరంజీవి అరియన్ష్ పుట్టినరోజు సందర్భంగా అనాధాశ్రమంలో అన్నదానం

అరియన్ష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

ప్రచురణకర్త / Publisher: Rajadhani Voice. Desk
📅 ప్రచురణ: 11 Nov 2026, 07:04 AM
🔄 నవీకరణ: 21 Nov 2026, 06:27 AM
👁️ 10 views
వాయిస్ న్యూస్ రీడర్ (Audio Reader)
వార్తను ఆడియోలో వినడానికి ప్లే చేయండి
వేగం (Speed):

అనాధాశ్రమంలో అరియన్ష్ జన్మదిన వేడుకలు

రాజుపాలెం.రాజధాని వాయిస్:

మండలంలో కొండమోడు గ్రామం వీరమ్మ కాలనీలో ఉన్న దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆద్వర్యంలో నడుస్తున్న అనాథ పిల్లల వృద్ధాశ్రమంలో డాక్టర్ పాలడుగు సాయి నివేద్, వారి ధర్మపత్ని డాక్టర్ అర్పిత దంపతుల కుమారుడు చిరంజీవి అరియన్ష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆశ్రమంలోని అనాథ పిల్లలు, వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అనంతరం అనాథ పిల్లలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ పాలడుగు సాయి నివేద్ మాట్లాడుతూ

"పుట్టినరోజులు అనేవి కేవలం మన కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునే వేడుకలు మాత్రమే కాకుండా, సమాజంలోని ఆపన్నులకు ఆనందాన్ని పంచే మంచి సందర్భాలుగా ఉండాలి. మనం సంపాదించే సంపదలో కొంత భాగాన్ని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి వినియోగించినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది.ముఖ్యంగా అనాథ పిల్లలకు ప్రేమ, ఆప్యాయతలు అందించడం, వృద్ధులకు గౌరవం, ఆదరణ కల్పించడం మనందరి సామాజిక బాధ్యత. మా కుమారుడు అరియన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిన్నారులు, పెద్దల మధ్య వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. చిన్నప్పటి నుంచే పిల్లలకు సేవాభావం, మానవత్వం, పరోపకారం వంటి విలువలను నేర్పించాలి.ప్రతి ఒక్కరూ తమకు చేతనైనంత సహాయం చేస్తూ సమాజంలో మానవత్వాన్ని చాటాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ చైర్మన్ గరికపాటి శంకర రావు పాల్గొని కార్యక్రమాన్ని అభినందించారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X
Header1