బుర్రి సునయన పుట్టినరోజు సందర్భంగా అయ్యప్ప అన్నదాన కమిటీకి 11,116 విరాళం అందించిన ఎంపిటిసి బుర్రి రాంబాబు
రాజుపాలెం.రాజధాని వాయిస్:
కొండమోడు గ్రామం నాగుమయ్య పుట్ట వద్ద అయ్యప్ప స్వాములు మహా అన్నదానా కార్యక్రమంలో భాగంగా సద్ది నిమిత్తం కొండమోడు గ్రామ నూతన టిడిపి ఎంపిటిసి బుర్రి రాంబాబు వీరి ధర్మపత్ని బుర్రి అరుణ మరియు బొక్కుల వెంకటరావు వీరి ధర్మపత్ని కృష్ణకుమారి కూతురైనటువంటి బుర్రి సునయన పుట్టినరోజు సందర్భంగా అన్నదానం నిమిత్తం 11,116 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అయ్యప్ప అన్నదానం కమిటీ వారు ఘనంగా సత్కరించటం జరిగింది.ఈ సందర్భంగా మాలాధారాణ ధరించిన అయ్యప్ప స్వాములు,పెద్దలు సునయన కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
Be the first to share your thoughts on this story!