రాజమండ్రి.
రాజధాని వాయిస్:
బీసీల హక్కులు, ఆత్మగౌరవం మరియు సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని మాజీ మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. రాజమండ్రిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ గర్జన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కొన్ని రాజకీయ పార్టీలు బీసీ వర్గాలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ వంచించాయని ఆమె ఆరోపించారు. బీసీల సమగ్ర అభివృద్ధి, హక్కుల సాధన కోసం సాగే పోరాటంలో పార్టీ ఎల్లవేళలా వెన్నంటి ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హాజరైన బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తమ ఐక్యతను చాటారు.
Be the first to share your thoughts on this story!