కారంపూడి అక్టోబర్ 04 రాజధాని వాయిస్ :
జగన్‌రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో బీసీలపై తీవ్ర అన్యాయం జరిగిందని, వారి ఆస్తులను సైతం లాక్కున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. అనాదిగా తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, అందుకే బీసీలంటే జగన్‌రెడ్డికి అక్కసు అని విమర్శించారు. అధికారాన్ని కోల్పోయి కేవలం 11 సీట్లకు పరిమితమైన వైసీపీ ఓటమిలో బీసీలు కీలక పాత్ర పోషించారని, అందుకే కక్షసాధింపు చర్యల్లో భాగంగా నేడు బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం బీసీలకు జనాభా దామాషా ప్రకారం 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేస్తే, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించడం దుర్మార్గమని జూలకంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనునిత్యం ఆలోచిస్తారని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని బీసీల పార్టీగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎస్సీ వర్గీకరణకు సైతం అప్పట్లో చంద్రబాబునాయుడు మద్దతు తెలిపారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సంస్కరణలు, సామాజిక విప్లవానికి నాంది పలికిన తెలుగుదేశం పార్టీ బీసీ రిజర్వేషన్లకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
జగన్‌రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ.. “గొడ్డలి పార్టీ, కాక్రోచ్ పార్టీలను దేశం నుంచి తరిమికొట్టాలి” అని పిలుపునిచ్చారు. తండ్రి శవంపై పుట్టుకొచ్చిన వైసీపీ.. బాబాయ్ గొడ్డలి వేటుతో అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని రక్తసిక్తం చేయాలని కుట్రలు పన్నుతున్న వైసీపీ శ్రేణులను స్థానిక ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు పంగులూరి అంజయ్య, మునిగోటి సత్యనారాయణ, బాలకృష్ణ, తండా మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!