Tuesday, 20 October 2026
Header1
BREAKING

అమరావతిలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 27 Sep 2026, 04:48 PM
🔄 నవీకరణ: 29 Sep 2026, 02:43 AM
👁️ 134 views

అమరావతి.

రాజధాని వాయిస్:

డిజిటల్ ఎజెండా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు రీడిజైన్ టూరిజం అనే ప్రధాన ఇతివృత్తంతో ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలను అమరావతిలో ఘనంగా నిర్వహించారు.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ రావత్ మరియు పర్యాటక శాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారి రవి సుభాష్ సూచనల మేరకు, పల్నాడు జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ డా. కృతిక శుక్లా ఆదేశాల మేరకు వారసత్వ నగరమైన అమరావతిలో పలు కార్యక్రమాలను నిర్వహించారు.
WhatsApp Image 2026-09-27 at 4.41.03 PM.jpeg

ఈ సందర్భంగా అమరావతిలోని *ఎస్సీ గురుకుల పాఠశాల (మహిళలు)*లో విద్యార్థులకు పర్యాటక ప్రదేశాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో క్విజ్, వ్యాసరచన మరియు డిబేట్ పోటీలు నిర్వహించారు.
అనంతరం ఉదయం 9.00 గంటలకు అమరావతి ఆర్కియాలజీ మ్యూజియం వద్ద నుంచి అమరావతి స్థూపం మీదుగా బుద్ధుని విగ్రహం వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. హెరిటేజ్ వాక్ అనంతరం బుద్ధుని విగ్రహం పరిసరాల్లో పరిశుభ్రత కార్యక్రమం, స్వచ్ఛ ఆంధ్ర ప్లెడ్జ్ మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. అలాగే వివిధ పోటీల్లో విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు.
ప్రపంచ పర్యాటక దినోత్సవం-2026 థీమ్‌కు అనుగుణంగా, పర్యాటక రంగంలో డిజిటల్ సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, వారసత్వ పర్యాటక అభివృద్ధి మరియు స్థిరమైన పర్యాటకం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
కలెక్టర్ చొరవతో కాలచక్ర మ్యూజియం ఆధునికీకరణకు రూ.8 లక్షలు
ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ డా. కృతిక శుక్లా అమరావతిలో పర్యాటక, చారిత్రక మరియు బౌద్ధ వారసత్వ పరంగా ప్రాముఖ్యత కలిగిన కాలచక్ర మ్యూజియాన్ని CSR నిధుల సహకారంతో రూ.8 లక్షల వ్యయంతో ఆధునికీకరించి అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు.
కాలచక్ర మ్యూజియం ఆధునికీకరణ పనులను త్వరితగతిన చేపట్టేందుకు APTDC ఇంజనీరింగ్ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారని, టెండర్ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేసి పనులను ప్రారంభించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో తెలిపారు.
అమరావతి బౌద్ధ వారసత్వం, చారిత్రక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని కాలచక్ర మ్యూజియం ఆధునికీకరణ పూర్తయితే పర్యాటకులకు మరింత మెరుగైన సౌకర్యాలు, సమాచారాన్ని అందించడంతో పాటు అమరావతి పర్యాటక ఆకర్షణను మరింత పెంచేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, INTACH గుంటూరు చాప్టర్ కన్వీనర్ రవిశంకర్, అఖిల భారత పంచాయతీ పరిషత్ (ఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు & పల్నాడు జిల్లా పర్యాటక మండలి సభ్యులు డా. జాస్తి వీరాంజనేయులు, కోలా వెంకటేశ్వరరావు, అమరావతి ఎంపీడీవో శివ పార్వతి, డిప్యూటీ ఎంపీడీవో రాజబాబు, ఈవోపీఆర్డీ పద్మజ, ఎంఈవో శివబాబు, ఎంఈవో-2 ప్రసాద్, అమరావతి యూనిట్ మేనేజర్ అశోక్, డీఈ కుమార్, మాజీ ఎంపీపీ మేకల హనుమంతరావు, గురుకుల పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X