వెల్దుర్తి: ఆగస్టు 28 రాజధాని వాయిస్ :కూటమి ప్రభుత్వం సిద్దం చేస్తున్న ప్రత్యేక ప్రణాళికతో సూపర్ ఎల్ నినో కారణంగా ఏర్పడిన పరిస్ధితుల నుంచి రైతులను కాపాడుకుంటామని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు.శుక్రవారం మండల పరిధిలోని గంగిరెడ్డిపల్లె చెరువులో పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక పశుగ్రాస పెంపకం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభంకానున్న ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు. రెండెకరాల్లో గడ్డి సాగుకు సిద్దంగా ఉన్న గడ్డి విత్తనాలను ట్రాక్టర్ ద్వారా వెదజల్లారు. పాడి పరిశ్రమ వృద్దికి దోహదపడే ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం గంగిరెడ్డిపల్లె గ్రామంలో పర్యటించి, స్ధానిక సమస్యలపై గ్రామస్తులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మోహన్ రెడ్డి, వెల్దుర్తి మండల పశువైద్యాధికారి డాక్టర్ సరిత, మండాది పశువైద్యులు డాక్టర్ మల్లికార్జునరావు, మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజబోయిన మధు, టీడీపీ నాయకులు జూలకంటి చిరంజీవిరెడ్డి, మందలపు రామకృష్ణ, వజ్రం నాయక్, శ్రీనివాసరెడ్డి తదతరులు పాల్గొన్నారు.
Telugu Daily
Friday, 28 August 2026
rajadhanivoice.in
సూపర్ ఎల్ నినో నుంచి రైతులను కాపాడుకుంటాం..!
- గంగిరెడ్డిపల్లె చెరువులో పశుగ్రాసం సాగుకు సాయం..!
- ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
📰
Official Article Source Link
https://rajadhanivoice.in/post/we-will-protect-farmers-from-super-el-nino
0 Comments