Friday, 28 August 2026
Telugu Daily
Header
BREAKING

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం..!

- విజన్ అధికారుల రివ్యూలో ఎమ్మెల్యే జూలకంటి


వెల్దుర్తి: ఆగస్టు 28  రాజధాని వాయిస్ :స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు అమలు చేస్తున్న పథకాలు, విజన్ యాక్షన్ యూనిట్స్, పీ4 అమలు వంటి వాటిపై 175 నియోజకవర్గాలకు కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్ స్ధానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి గబ్రూ నాయక్, యంగ్ ప్రొఫెషనల్ సాంబశివరావు, నాలెడ్జ్ పార్నర్ వెంకట్రామిరెడ్డి, విజన్ స్ధాఫ్ లక్ష్మీనారాయణ, తులస్య నాయక్, సుజాత పాల్గొన్నారు. వీడియో కాన్ఫెరెన్స్ ముగిసిన తరువాత సిబ్బందితో ఎమ్మెల్యే జూలకంటి సమీక్షించారు. నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడే అంశాలు, స్వర్ణాంధ్ర సాధనకు అవసరమయ్యే లక్షాలు, పీ4 బంగారు కుటుంబాలకు తోడ్పాటు, పారదర్శకంగా పీజీఆర్ఎస్ నిర్వాహణ వంటి వాటిపై చర్చించారు.

Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!