వినుకొండ ఆగస్టు 28 రాజధాని వాయిస్ : వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల మండలం, ఐనవోలు గ్రామంలో రూ. 1.93 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) నిర్మాణ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు గారు శుక్రవారం శంకుస్థాపన చేశారు. జీవీ గారు మాట్లాడుతూ, "ఆరోగ్యమే మహాభాగ్యం" అనే స్పూర్తితో 'హెల్త్ ఆంధ్రప్రదేశ్' సాధించే దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. గ్రామీణ వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు, పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం చేరువ చేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు గారు కూటమి నాయకులు, అధికారులు, వైద్య సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Telugu Daily
Friday, 28 August 2026
rajadhanivoice.in
నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చీఫ్ విప్ జీవీ
- గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చీఫ్ విప్,జీవీ
0 Comments