మాచర్ల:
తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ఎగువ పల్నాడు ప్రాంతమైన మాచర్ల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం రాకతో ప్రతి ఇంటికీ జల సిరులు బిరబిరా పరుగులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దార్శనికులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రగతి రథంపై నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి జోడి నియోజకవర్గంలో సర్వతోముఖాభివృద్ధి శరవేగంగా జరుగుతోంది”..!
- గ్రామీణ తాగునీటికి రూ.800 కోట్లతో జల్ జీవన్ మిషన్ ..!
మాచర్ల నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో గ్రామీణ తాగునీటి అవసరాలకు రూ.800 కోట్లతో జల్ జీవన్ మిషన్ పైపులైన్ పనులను ఇప్పటికే శరవేగంగా చేపట్టారు. మాచర్ల మండలంలోని విజయపురిసౌత్ వద్దనున్న మేకలగొంది వద్ద సాగర్ జలాలను శుద్దికి అతిపెద్ద వాటర్ ఫిల్టర్ పంపుహౌస్ నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి శుద్ధ జలాలను పైపులైన్ల ద్వారా మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంపూడి మండాలకు నీటిని తరలిస్తారు. మరోవైపు అవసరమైన ప్రాంతాల్లో ఇప్పటికే ఓవర్ హెడ్ నీటి ట్యాంకుల నిర్మాణాలు జరుగుతున్నాయి. దాదాపు రూ.1200 కోట్లతో నిర్మిస్తున్న ఈ వాటర్ గ్రిడ్ ఒక్క మాచర్ల నియోజకర్గంలోనే రూ. 800 కోట్లకు పైగా నిధులు వెచ్చించనున్నారు. ఈ వాటర్ గ్రిడ్ అందుబాటులోకి వస్తే దాదాపు తాగునీటి ఎద్దడిని పూర్తిస్ధాయిలో శాశ్వతంగా చెక్ పెట్టవచ్చునని అధికారులు చెబుతున్నారు.
- మాచర్ల మున్సిపాలిటీ చరిత్రలో సువర్ణాధ్యయం..!
1983 లో మేజరు పంచాయతీగా ఉన్న మాచర్ల ను గ్రేడ్ -3 మున్సిపాలిటీ గా ప్రకటిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత గ్రేడ్-2 గా అప్ గ్రేడ్ అయ్యింది. మాచర్ల మున్సిపాలిటీ పరిధి రానున్న 25 ఏళ్లకు సరిపడా తాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర తాగునీటి సరఫరా ప్రణాళికలను సిద్దం చేస్తోంది. రెండు దశాబ్ధాలుగా తాగునీటి కోసం ప్రజలు మున్సిపల్ ట్యాంకర్లు.., నీటి వ్యాపారం చేసే ప్రైవేటు వ్యవస్ధలపై ఆధారపడి నెలవారీ డబ్బులిచ్చి మరి తాగునీటికి కొనుగోలు చేసుకోవాల్సిన దుస్ధితిని ఇక బయటపడనున్నది. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ 2.0 స్కీమ్ ద్వారా దాదాపు రూ. 146 కోట్లకు పైగా నిధులతో ప్రతి ఇంటికీ తాగునీటి కులాయిలతో శుద్ధ జలాలను అందించేందుకు వచ్చే నెల 1వ తేదీన పట్టణంలోని శ్రీనివాస మహాల్ సెంటర్ నందు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్ధాపన చేయనున్నారు.
-వచ్చే ఏడాది నాటి ఇంటింటికీ బుగ్గవాగు జలాలు..!
మాచర్ల మున్సిపాలిటీ పరిధిలోని వచ్చే ఏడాది నాటికి బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను అమృత్ పథకం 2.0లో భాగంగా ప్రతి ఇంటికీ కుళాయిలు ద్వారా శుద్ధి చేసిన జలాలను అందించనున్నది కూటమి ప్రభుత్వం. వేసివి కాలం వచ్చిందంటే సాగర్ కుడి కాలువకు నీరు ఆగిసోవడం, మున్సిపాలిటీ క్వారీలో నీరు ఇంకిపోవడం వంటివి సర్వసాధారణంగా ఎదురయ్యే సమస్య. తీవ్ర తాగునీటి ఎద్దడికి దారితీసే పరిస్ధితుల్లో పట్టణ జీవనం కనీస అవసరాలకు నీరు అందక కడు దుర్బరంగా మారేది. తాగునీటి కోసం ప్రత్యేక బడ్జెట్ పెట్టి.., ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించినప్పటికీ అనుకున్న లక్ష్యాలను మున్సిపాలిటీ అందుకోలేక ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తేవి. ఈ క్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పట్టణంలోని తాగునీటి ఇబ్బందులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా.., కేంద్రంతో సంప్రదింపులు జరిపి అమృత్ స్కీమ్ 2.0 ద్వారా నిధులను మాచర్ల మున్సిపాలిటీకి కేటాయింపులు జరిపింది కూటమి ప్రభుత్వం. రూ. 146 కోట్ల పైగా నిధులతో నిర్మించే ఈ వాటర్ గ్రిడ్ ను యుద్ధ ప్రతిపాదికన నిర్మించేందుకు మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ గుత్తేదారు సంస్థ వచ్చే నెల నుంచి పనులను ప్రారంభించనున్నది.
- అమృత్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ రోడ్డు మ్యాప్ ఇలా .. !
అమృత్ 2.0 ద్వారా దాదాపు రూ.146 కోట్ల వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనులను దక్కించుకున్న మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ గుత్తేదారు సంస్థ ముందుగా బుగ్గవాగు రిజర్వాయర్ ద్వారా తాగునీటిని లిఫ్ట్ ద్వారా ఎత్తిపోసేందుకు కావాల్సిన మౌళిక సదుపాయాలను సిద్దం చేస్తోంది. ఆ తరువాత మాచర్ల మున్సిపాలిటీ పంపు హౌస్ నందు ఎకరం నర ఖాళీ స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లోకి నీటిని బుగ్గవాగు నుంచి పైపులైన్ సహకారంతో తరలిస్తారు. అక్కడ శుద్ది చేసిన జలాలను మున్సిసాలిటీలో పంపు హౌస్ నందు అందుబాటులో ఉన్న 22 లక్షల కెపాసిటీ వాటర్ స్టోరేజ్ ఉన్న రెండు వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులకు నీటిని నింపుతారు. ఆ తరువాత ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా మాచర్ల పట్టణంలో ఫైర్ స్టేషన్ వద్ద ( 10 లక్షల వాటర్ కెపాసిటీ ), రోప్ వే కాలనీ లో ( 8 లక్షల వాటర్ కెపాసిటీ), టిడ్కో ఇళ్ల సముదాయాల వద్ద ( 6 లక్షల వాటర్ కెపాసిటీ), వినాయకునిగుట్టపై ( 5 లక్షల వాటర్ కెపాసిటీ), లింగాపురం కాలనీ (3 లక్షల వాటర్ కెపాసిటీ) వంటి ప్రాంతాల్లో నూతనంగా వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మాణాలు జరిపి, 24 గంటలకు తాగునీటి అందించేందుకు చర్యలు తీసుకుంటారు. మరోవైపు వచ్చే ఏడాది నాటికి పూర్తి స్ధాయిలో పనులు పూర్తి చేసి, ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రణాళికబద్దంగా అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది.
0 Comments