Tuesday, 20 October 2026
Header1
BREAKING

24, 27 వార్డుల్లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పర్యటన

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📍 మాచర్ల
📅 ప్రచురణ: 29 Sep 2026, 06:51 AM
🔄 నవీకరణ: 18 Oct 2026, 12:41 PM
👁️ 114 views

మాచర్ల, సెప్టెంబర్ 29 – రాజధాని వాయిస్:

మాచర్ల పట్టణంలోని 24, 27వ వార్డుల్లో మాచర్ల శాసనసభ్యులు  జూలకంటి బ్రహ్మానంద రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లోని ప్రజలను నేరుగా కలిసి స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

WhatsApp Image 2026-09-29 at 6.45.00 AM.jpeg
Type image caption here...


వార్డుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులతో చర్చించారు. ముఖ్యంగా HAM పథకం నిధులను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుని వార్డుల అభివృద్ధికి అవసరమైన పనులు చేపట్టే అంశంపై స్థానిక మున్సిపల్ అధికారులతో, కూటమి పార్టీల నాయకులతో చర్చించారు.

WhatsApp Image 2026-09-29 at 6.45.00 AM (1).jpeg
Type image caption here...


ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, వార్డుల్లోని సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.

WhatsApp Image 2026-09-29 at 6.45.00 AM (2).jpeg
Type image caption here...


ఈ పర్యటనలో మాచర్ల టీడీపీ పార్టీ అధ్యక్షులు కొమెర దుర్గారావుతో పాటు స్థానిక కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X