దుర్గి సెప్టెంబర్ 25 రాజధాని వాయిస్ :
పట్టణంలోని ప్రధాన కూడలిలో శుక్రవారం కారంపూడి సీఐ ఆవుల భాస్కర్ ఆధ్వర్యంలో, దుర్గి ఎస్సై బి. గోపాల్ మరియు పోలీసు సిబ్బందితో కలిసి విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రధాన కూడళ్లలో పహారా కాస్తూ ప్రజలకు రక్షణ భరోసా కల్పించడంతో పాటు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సీఐ ఆవుల భాస్కర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలను విధిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ మరియు మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల ప్రాణరక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా మండలంలో నిరంతరం విజిబుల్ పోలీసింగ్ కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
Be the first to share your thoughts on this story!