Tuesday, 20 October 2026
Header1
BREAKING

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

- బార్ & వైన్ షాపుల యజమానులకు డీఎస్పీ హెచ్చరిక

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 25 Sep 2026, 08:17 PM
🔄 నవీకరణ: 30 Sep 2026, 04:35 PM
👁️ 414 views

నరసరావుపేట.

సెప్టెంబర్ 25
రాజధాని వాయిస్ :

పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి ఆదేశాల మేరకు స్థానిక ఎస్డీపీఓ కార్యాలయంలో వైన్ షాపులు, బార్ & రెస్టారెంట్ యజమానులతో డీఎస్పీ ఎం. హనుమంతరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలోని 34 మద్యం దుకాణాలకు గాను 30 మంది యజమానులు హాజరైన ఈ సమావేశంలో పోలీస్ ఉన్నతాధికారుల మార్గదర్శకాలను డీఎస్పీ స్పష్టం చేశారు.
వైన్ షాపులను రాత్రి 10:00 గంటలకు, బార్లను అర్ధరాత్రి 12:00 లోపు నిబంధనల ప్రకారం మూసివేయాలని తెలిపారు. దుకాణాల వద్ద లూజ్ సేల్ చేయడం, బెల్ట్ షాపులను ప్రోత్సహించడం లేదా వాటికి మద్యం విక్రయించడం పూర్తిగా నిషిద్ధమని స్పష్టం చేశారు. మైనర్లకు, ఇప్పటికే మద్యం సేవించి ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అమ్మరాదని, ప్రాంగణాల వద్ద అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా క్రమశిక్షణ పాటించాలని తేల్చిచెప్పారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా వ్యాపారులు పోలీసు శాఖకు సహకరించాలని, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే ఎస్పీ ఆదేశాల మేరకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సబ్-డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X