మాచర్ల, అక్టోబర్ 01 (రాజధాని వాయిస్ ప్రతినిధి):
మండవ మాచర్ల ప్రీమియర్ లీగ్ (ఎంఎంపీఎల్)లో భాగంగా బుధవారం జరిగిన తొలి టీ20 క్రికెట్ మ్యాచ్‌లో ఓల్డ్ టౌన్ లయన్స్ జట్టు ఐదు పరుగుల తేడాతో వెల్దుర్తి వారియర్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచిన వెల్దుర్తి వారియర్స్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఓల్డ్ టౌన్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం 152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెల్దుర్తి వారియర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులకే పరిమితమైంది. దీంతో ఓల్డ్ టౌన్ లయన్స్ ఐదు పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ప్రతిభ కనబరిచిన ఎర్రబోయినికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మాచర్ల పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ జలీల్ చేతుల మీదుగా ఆయనకు బహుమతిని అందజేశారు.
Be the first to share your thoughts on this story!