సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని 09 మండలాల్లో ఎన్నికలు..
ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి:
జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ ఆదహళ్లి
జిల్లాలో రెండో దశలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి, తెలిపారు.నవంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది, నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలోని 09 మండలాల్లో గ్రామపంచాయతీలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు.నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, అభ్యర్థులు, వారి అనుచరులు నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.నామినేషన్ కేంద్రాల 100 మీటర్ల పరిధిలో ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలను గుర్తించి డ్రోన్ సిసి కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని తెలిపారు. ఆయా గ్రామాల్లో ఫుట్ పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రజల్లో భద్రతాభావం కల్పించాలన్నారు.పోలీసు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలనిపోలీసు అధికారులు తమ పరిధిలోని నామినేషన్ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని, ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎస్పీ గారు ఆదేశించారు.ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.నామినేషన్ల ప్రక్రియ నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు.
Be the first to share your thoughts on this story!