ఎన్నికల నిర్వహణలో పోలీసుల సమర్థవంతమైన విధులు, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లపై ప్రశంసలు
నరసరావుపేట.
పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేస్తున్న పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి పనితీరును రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రత్యేకంగా అభినందించారు.
గడిచిన మున్సిపాలిటీ ఎంపీటీసీ, జడ్పిటిసి మరియు మూడు విడతల పంచాయితీ నామినేషన్ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టడం, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం, క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులను సమన్వయం చేస్తూ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేలా పర్యవేక్షించడం వంటి చర్యలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రశంసించారు
ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, ఎన్నికల కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్న జిల్లా ఎస్పీ పనితీరు అభినందనీయమని పేర్కొన్నారు.
పల్నాడు జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా జరిగేలా కృషి చేస్తున్న జిల్లా ఎస్పీతో పాటు పోలీసు అధికారులందరినీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అభినందించారు.
Be the first to share your thoughts on this story!