మాచర్ల, అక్టోబర్ 13 రాజధాని వాయిస్:
సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, అడ్డంకులను ఎదుర్కొని జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న తనకు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహక దళ్ కమిటీలో అవకాశం కల్పించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని జనసేన పార్టీ మాచర్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మైలా శ్రీనివాస్ తెలిపారు.
పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న తనపై నాయకత్వం ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనని స్పష్టం చేశారు. ముగ్గురు సమన్వయకర్తల జాబితాలో తన పేరు ఉంటే మరింత బాగుండేదని కొందరు నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని తెలిపారు.
పార్టీకి, కార్యకర్తలకు రావాల్సిన పదవులు, అవకాశాల కోసం న్యాయబద్ధంగా కృషి చేస్తానని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు.
తనకు ఈ అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తూ జనసేన బలోపేతానికి కృషి చేస్తానని మైలా శ్రీనివాస్ వెల్లడించారు.
Be the first to share your thoughts on this story!