Saturday, 29 August 2026
Telugu Daily
Header
BREAKING

రేపల్లె ఆడబిడ్డలకు శ్రీరామరక్షగా నిలుస్తా...

మంత్రి అనగాని సత్యప్రసాద్

​రేపల్లె. ఆగస్టు 28 రాజధాని వాయిస్ :

 అక్కాతమ్ముళ్ల అనురాగానికి, అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని, తన సోదరీమణుల ప్రేమాశీస్సులే ప్రజాసేవలో తనకు కొండంత బలాన్ని ఇస్తున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన తన ప్రియమైన సోదరీమణులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని, డాక్టర్ కమల అనగానిల చేతుల మీదుగా రాఖీ కట్టించుకుని వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నతనం నుంచీ అమ్మలా లాలించి, తన ఎదుగుదలలో అడుగడుగునా ప్రోత్సహిస్తూ ప్రజాసేవ దిశగా మార్గదర్శనం చేసిన సోదరీమణుల రుణం ఎనలేనిదని భావోద్వేగానికి లోనయ్యారు. అమ్మ చూపే ప్రేమ, నాన్న ఇచ్చే ధైర్యం కలబోసిన రూపాలే తన సోదరీమణులని, జన్మజన్మలకీ వారికే సోదరుడిగా పుట్టి ప్రతి ఏటా ఇలాగే రాఖీ కట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
​ఈ ఆత్మీయ పర్వదినం సందర్భంగా రేపల్లె నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ ఆయన హృదయపూర్వక రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. గత రెండు దశాబ్దాలుగా తనను సొంత సోదరుడిలా గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్న రేపల్లె అక్కాచెల్లెళ్ల రుణం తీర్చుకోలేనిదని కొనియాడారు. నియోజకవర్గంలోని ప్రతీ ఆడబిడ్డ తన సొంత తోబుట్టువుతో సమానమని స్పష్టం చేస్తూ, వారి కష్టసుఖాల్లో ఓ అన్నగా, తమ్ముడిగా ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి, వారి కుటుంబాలకు శ్రీరామరక్షగా నిలుస్తానని మాటిచ్చారు. తన కుటుంబమైన రేపల్లె ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వులు పూయించేందుకు, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తానని ఎమ్మెల్యే సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
Share this Article:

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!