మాచర్ల, నవంబర్ 15 – రాజధాని వాయిస్:
కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మాచర్ల డిపో నుంచి అరుణాచలం, పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సిహెచ్.కె.ఎస్ మార్గరెట్ తెలిపారు.
అరుణాచలం గిరి ప్రదక్షిణ, అరుణాచలేశ్వరుని దర్శనం కోసం నవంబర్ 22 నుంచి 24 వరకు మూడు రోజుల యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రకు సూపర్ లగ్జరీ బస్సులో రానుపోను కలిపి ఒక్కొక్కరికి రూ.2,750 ఛార్జీగా నిర్ణయించారు.
అలాగే పంచారామ క్షేత్రాల దర్శనం కోసం నవంబర్ 15, 22, 29 మరియు డిసెంబర్ 6 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ యాత్రకు ఒక్కొక్కరికి రూ.1,600 ఛార్జీగా నిర్ణయించారు.
వివరాలకు 7382801048, 9951706120, 9959225432 నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
Be the first to share your thoughts on this story!