కారంపూడి.
రాజధాని వాయిస్ :
కారంపూడి మండలం నరమాలపాడు గ్రామానికి చెందిన బుస్సా వెంకటేశ్వర్లు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, ఆయన కుటుంబ సభ్యులను పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం పరామర్శించారు. గ్రామానికి చేరుకున్న ఆయన వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ రూ. 10,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!