మాచర్ల.
నవంబర్ 16
రాజధాని వాయిస్ :
మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన కొప్పుల రామ్మూర్తి అనారోగ్యంతో బాధపడుతూ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకుని, పల్నాడు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా రామ్మూర్తిని ఆప్యాయంగా పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి, ధైర్యం చెప్పారు. పార్టీ కుటుంబ సభ్యుడిగా ఎప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!