Tuesday, 20 October 2026
Header1
BREAKING

మాచర్లలో మండవ ఎం పి ఎల్ క్రికెట్ పోటీలు : మండవ రవి

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 28 Sep 2026, 10:09 AM
🔄 నవీకరణ: 18 Oct 2026, 10:17 PM
👁️ 131 views

మాచర్ల సెప్టెంబర్ 28 రాజధాని వాయిస్ :

రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన పల్నాడు ప్రాంతంలో యువకులకు క్రీడా స్ఫూర్తి నింపాలని క్రీడలకు, క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అందించాలని ఉద్దేశంతోనే మండవ ఎం పి ఎల్ ప్రీమియర్ లీగ్లు నిర్వహిస్తున్నట్టు చైర్మన్ మండల రవి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ క్రీడాకారుల సెలక్షన్ విషయంలో నాలుగు నెలలు తన సహచర మిత్రులతో శ్రమించి ఎనిమిది జట్లను తయారు చేశామని తెలిపారు. ఎనిమిది జట్లను ఒక్కొక్క జట్టు లో 20 మంది క్రీడాకారులు ఉండే విధంగా టీం రెడీ చేశామని అన్నారు. మాచర్ల నియోజకవర్గం లోని అన్ని మండలాలలో ఉన్న యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి వరకు తమ ప్రతిభను కనబరచాలని అలా ఒక్కరు కనబరిచిన మాచర్ల దేశస్థాయిలో వినిపిస్తుందని ఆయన అన్నారు. ఈ యొక్క మండవ ఎంపీఎల్ నీ నిర్వహించడానికి సుమారు 42 లక్షల వరకు ఖర్చవుతుందని అందుకు తాము సిద్ధమని అన్నారు. ఈనెల 30 కి మండవ ఎంపీఎల్ కు సర్వం సిద్ధం అదేవిధంగా మాచర్ల పరిసర ప్రాంతాల్లో మండవ రవి పేరు తెలియని వారు ఉండరు గతంలో పలు సేవా కార్యక్రమాలు ద్వారా ప్రజల్లోకి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టారు. యూత్ లో మండవ రవి కి బారి పాలోవింగు ఉంది. మరలా 20 సంవత్సరాల తర్వాత తన సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు రావడం చాలా సంతోషమని మాచర్ల పరిసర ప్రాంత ప్రజలు, యువకులు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో మాచర్ల జర్నలిస్టు నాయకులైన గాడిపర్తి శ్రీనివాసరావు, ఎం.ఎస్ నాగేశ్వరావు, రామచంద్రారెడ్డి సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ గతంలో మండవ రవి ద్వారా మూడు కోట్ల సేవా కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు డాక్టర్ కే. పి. చారి, అన్వర్, చిన్ని ,సీత అంజి, వెంకటరెడ్డి, సాంబశివరావు, వాసు, పాటిబండ్ల చెన్నకేశవ, షేక్ ఖాసిం, నజీర్ మాస్టర్, నారాయణ, వేణుగోపాల్ ,ఇమామ్, ప్రవీణ్ ,కిరణ్ , నవీన్, మీడియా మిత్రులు, జట్టు యజమానులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X