Tuesday, 20 October 2026
Header1
BREAKING

క్రీడాభివృద్ధికి మండవ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం

- విజేతలకు బహుమతులు అందజేసిన ఎస్సీ కమీషన్ రాష్ట్ర సభ్యులు మేకల భిక్షం.

ప్రచురణకర్త / Publisher: (Rajadhani Voice. Desk)
📅 ప్రచురణ: 10 Oct 2026, 06:15 PM
🔄 నవీకరణ: 12 Oct 2026, 03:38 PM
👁️ 43 views
మాచర్ల అక్టోబర్ 10 రాజధాని వాయిస్ :
పల్నాడు ప్రాంతంలో మెరికల్లాంటి క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేలా మండవ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మండవ రవి చేస్తున్న సేవలు అభినందనయమని ఎస్సీ కమిషన్ రాష్ట్ర సభ్యులు మేకల భిక్షం (దాసు) అన్నారు.
శనివారం మాచర్లలోని ఎస్ కేబీఆర్ గ్రౌండ్ లో జరుగుతున్న మండవ మాచర్ల ప్రీమియం లీగ్ (ఎంపిఎల్) పోటీలకు ముఖ్య అతిధిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండవ రవి మాచర్లలో ఎంతోకాలంగా పేదలకు అవసరమైన సేవలు, ఆర్షిక భరోసాను సైతం అందించారన్నారు. పల్నాడులో ఎందరో ప్రతిభావంతమైన క్రీడాకారులు ఉన్నారన్నారు. సరైన ప్రోత్సాహం లేక క్రీడలకు దూరమవుతున్నారన్నారు. మాచర్లలో ప్రతిష్టాత్మకంగా ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి మండవ మాచర్ల ప్రీమియం లీగ్ క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం మాచర్లలో క్రీడల అభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉంటూ తమకు నచ్చిన క్రీడల్లో రాణించి ఉన్నత స్థానాలకు చేరాలని కోరారు. తద్వారా తల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు మంచి పేరు తేవాలన్నారు.
గెలుపు, ఓటములను సమాన స్థాయిలో స్వీకరించి క్రీడాకారులు స్ఫూర్తితో ముందుకు వెళ్లాలన్నారు.
పల్నాడులో బ్రహ్మనాయుడు, కన్నమాదాసు నడయడిన నెల అని వారిని ఆదర్శంగా తీసుకుని పల్నాడు ప్రాంతంలో సమైక్యతతో ముందుకు వెళ్లాలన్నారు.
మండవ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహించే సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఇదే స్ఫూర్తితో మండవ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రజాసేవలో ముందడుగు వేయలన్నారు.
క్రీడల్లో పాల్గొన్ని పత్రికీడాకారున్ని, నిర్వాహక సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు.
ఈ సంద్భంగా క్రీడా పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు బహుమతులు అందజేసి అభినందించారు.
కార్యక్రమంలో మండవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ రవి, టిడిపి సీనియర్ నాయకులు కేశవరెడ్డి, ఏం. నారయ్య, అన్వర్ పాల్గొన్నారు.

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X