కారంపూడి ( కాచవరం ) అక్టోబర్ 04 రాజధాని వాయిస్ :
అన్నీరంగాల అభ్యున్నతికి పాటుపడి.., సామాజీక సంస్కరణలకు రాజకీయ బీజం వేసిన మహనీయులు, యుగపురుషుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్ధాపకులు అన్న ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కొనియాడారు. మండల పరిధిలోని కాచవరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేతులుమీదిగా ప్రారంభించారు. పూలలతో ఘనంగా నివాళులర్పించి.., ఎన్టీఆర్ చూపిన మార్గంలో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పంగులూరి అంజయ్య, పంగులూరి పుల్లయ్య, మునిగోటి సత్యనారాయణ, చప్పిడి రాము, బాలకృష్ణ, తండా మస్తాన్ వలి, షేక్ రహీమ్ తదితరులు పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!