సత్తెనపల్లి: నవంబర్ 11 రాజధాని వాయిస్ :
సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకంతో ఇతర పార్టీల నాయకులు టీడీపీలో చేరుతున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ క్రమంలో సత్తెనపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కందులవారిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బూతుకూరి కిరణ్ కుమార్ రెడ్డి, చప్పిడి బాబు తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సమర్థవంతమైన పాలన, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతో రోజురోజుకూ ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి చేరికలు పెరుగుతున్నాయని తెలిపారు.
కందులవారిపాలెం గ్రామ అభివృద్ధికి కిరణ్ కుమార్ రెడ్డి, చప్పిడి బాబు కలిసి కృషి చేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారికి తగిన గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. వారి చేరికతో గ్రామంలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని కన్నా లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.

Be the first to share your thoughts on this story!