మాచర్ల, అక్టోబర్ 7 — రాజధాని వాయిస్:
మాచర్ల పురపాలక సంఘం పరిధిలో కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కోతులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు పలుమార్లు మున్సిపల్ కార్యాలయంలో, పి.జి.ఆర్.ఎస్. ద్వారా అర్జీలు సమర్పించారు.

ఈ సమస్యపై మున్సిపల్ కమిషనర్ డి. వేణుబాబు స్పందించి కోతులను పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 27న 150 కోతులను పట్టుకుని శ్రీశైలం అడవులకు తరలించారు.
అదే విధంగా అక్టోబర్ 7న మరో 145 కోతులను పట్టుకున్నారు. పట్టుబడిన కోతులను కూడా శ్రీశైలం అడవులకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
కోతుల బెడదను నివారించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు కొనసాగించాలని స్థానికులు కోరుతున్నారు.
Be the first to share your thoughts on this story!